• జనాలకు కేంద్రం ఇంకో షాక్!

    Published Date : 18-Nov-2016 9:20:10 IST

    నోట్ల మార్పిడి విషయంలో రూ.4,500 వరకూ ఉన్న పరిమితిని కేంద్రం మరింతగా తగ్గించింది. వెయ్యి రూపాయల, ఐదు వందల రూపాయల నోట్లను ఇచ్చి వంద, కొత్త నోట్లను తీసుకునేందుకు ఉన్న మార్గాన్ని మరింతగా మూసేసింది. మొదట్లో ఈ పరిమితి నాలుగు వేల రూపాయల వరకూ ఉండేది. ఆ అసౌకర్యంపై విమర్శలు రావడంతో పరిమితిని ఐదువందల రూపాయలు పెంచారు. అయితే ఇప్పుడు ఆ పరిమితిని రెండు వేల రూపాయలకు తగ్గించడం ద్వారా కేంద్రం నగదు కష్టాలను మరింత పెంచింది.

Related Post