• అంబానీ.. నష్టాలు తట్టుకోలేక అమ్మేశాడు!

    Published Date : 06-Nov-2017 8:32:38 IST

    అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్‌కామ్ తమ ఆధీనంలోని బిగ్ టీవీని అమ్మేసింది. బిగ్ టీవీ పేరుతో ఆర్ కామ్ డీటీహెచ్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో డీటీహెచ్ ల హవా మొదలయ్యాకా రిలయర్స్ తరఫు నుంచి బిగ్ టీవీ ఆరంభం అయ్యింది. అయితే ఈ దీనికి ఆది నుంచి నష్టాలు వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారాన్ని తగ్గించుకోవడానికి ఈ డీటీహెచ్ సర్వీసును అమ్మేసినట్టు సమాచారం. వీకాన్ మీడియా అండ్ టెలివిజన్ లిమిటెడ్ ఈ సర్వీసును కొనుగోలు చేసింది.

Related Post