• మాల్యా ఆస్తులు.. భారీ ఎత్తున స్వాధీనం..?
  Published Date : 18-Sep-2017 10:03:07IST

  బ్యాంకులకు దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులను ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యా విషయంలో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధం అయినట్టు సమాచారం. ఎలాంటి తాకట్టులోని మాల్యా ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని సమాచారం. యూబీఎల్, యూనైటెడ్ స్పిరిట్ లిమిటెడ్, మెక్ డోవెల్స్ హోల్డింగ్ లిమిటెడ్ లలోని మాల్యా షేర్లను కేంద్ర ప్రభుత్వం బదలాయించుకుంటుందని సమాచారం. వీటి విలువ నాలుగు వేల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చని సమాచారం.

  Read More
 • రెండు వందల రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయి!
  Published Date : 05-Jul-2017 7:34:00IST

  అతి త్వరలోనే రెండు వందల రూపాయల నోట్లు మారకంలోనికి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ మొదలైందని తెలిపింది. కొన్ని రోజుల కిందట ఆర్బీఐ ముద్రణాలయానికి ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు ప్రింటింగ్ పూర్తి చేసుకుని, రెండొందల రూపాయల నోట్లు మారకంలోకి వస్తున్నాయి. దేశంలో చిల్లర సమస్యను తీర్చడానికే ఈ నోట్లను తీసుకొస్తున్నట్టుగా ఆర్బీఐ తెలిపింది. నోట్ల విషయంలో ఆర్బీఐ ప్రయోగాలు ఇలా కొనసాగుతున్నాయి.

  Read More
 • అలా చేసుకోకపోతే మీ పాన్ కార్డు చెల్లదు!
  Published Date : 29-Jun-2017 8:23:46IST

  జులై 1 నుంచి పాన్‌-ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల్లో చేసిన సవరణలను కేంద్రం నోటిఫై చేసింది. దీని ప్రకారం 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను పాన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందాలంటే ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం జారీ చేసిన ప్రకటనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్‌-పాన్‌ అనుసంధాన్ని తప్పనిసరి చేస్తూ మరుసటి రోజే నిర్ణయం తీసుకుంది.

  Read More

 • Widget not in any sidebars
 • జీఎస్టీ వస్తోంది… డిస్కౌంట్లు వచ్చేశాయి!
  Published Date : 15-Jun-2017 9:38:06IST

  కేంద్రప్రభుత్వం జూలై 1 నుంచి జీఎస్టీ బిల్లును అమల్లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. తుదిగడువు దగ్గర పడే కొద్ది నిల్వలు వదిలించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈనేపథ్యంలో పేటియం, షాప్‌క్లూస్‌, లెవీస్‌ వంటి ఆన్ లైన్, ఆఫ్ లైన్ అమ్మకందార్ల దగ్గర నుంచి బజాజ్‌ ఆటో వరకు, బ్రాండ్స్‌ నుంచి రిటైలర్స్‌ దాకా అన్ని కంపెనీలు భారీ డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి. అన్ని ఈ- కామర్స్‌ కం‍పెనీలు తమ​ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయాలు జరిపే ఉత్పత్తులపై అధిక మొత్తంలో తగ్గింపులను ప్రకటిస్తున్నాయి.

  Read More
 • ఇండియాలో రెమ్యూనరేషన్ లో ఆ ముగ్గురే టాప్!
  Published Date : 13-Jun-2017 8:21:23IST

  ఫోర్బ్స్ టాప్ హండ్రెడ్ సినీ సెలబ్రిటీస్ లో ముగ్గురు భారతీయ నటులు స్థానం సంపాదించారు. అత్యధిక సంపాదనతో వీరు ఇండియన్ టాప్ సినీ హీరోస్ గా నిలిచారు. వంద మంది జాబితాలో చూస్తే.. షారూక్ 245 కోట్ల రూపాయల పారితోషకంతో 65వ స్థానంలో నిలిచాడు. సల్మాన్ 238 కోట్ల పారితోషకంతో 71వ స్థానంలో, అక్షయ్ కుమార్ 228 కోట్ల సంపాదనతో 80వ స్థానంలో నిలిచాడు. మరే ఇండియన్ హీరో ఈ జాబితాలో లేడు.

  Read More
 • ఆ కంపెనీ కార్ల రేట్లు తగ్గాయి!
  Published Date : 30-May-2017 10:00:06IST

  వివిధ శ్రేణుల్లోని తన వాహనాల ధరలను తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది ఫోర్డ్ ఇండియా. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన చేసింది ఆ సంస్థ. జీఎస్టీతో కార్ల ధరలు పెరగాల్సి ఉంది. ఈ భారం కస్టమర్లపై పడకుండా కార్ల ధరలను తగ్గించినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఎకో స్పోర్ట్‌ శ్రేణిలోని కార్లపై రూ.20వేల నుంచి రూ.30వేల వరకూ తగ్గించడం ద్వారా రూ.7.18లక్షల నుంచి రూ.10.76లక్షల మధ్య కార్లు లభించనున్నాయి. ఇక ఫిగో, యాస్పైర్‌ కార్ల ధరలు రూ.10వేల నుంచి రూ.25 వేల వరకూ తగ్గనున్నాయి.

  Read More

 • Widget not in any sidebars
 • విప్రో.. ఎంత మందిని ఇంటికి పంపుతోంది..?
  Published Date : 22-May-2017 7:35:32IST

  దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఇండస్ట్రీస్ పై ఆటోమేషన్ ప్రభావం తీవ్రంగానే పడుతోంది. ఇండియన్ ఐటీ పరిశ్రమకు సంక్షోభం సంభవించిందన్న ఊహగానాల మధ్య విప్రో వేట చర్చనీయాంశంగా మారింది. ఒక అంచనా ప్రకారం విప్రో పది శాతం ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్టుగా తెలుస్తోంది. విప్రోలో దాదాపు లక్షా ఎనభై వేల మంది పని చేస్తున్నారు. వీరిలో పదిశాతం మందిని ఈ ఏడాది ఇంటికి పంపించవచ్చని అంచనా. ఓవరాల్గా మూడేళ్లలో నలభై ఏడు వేల మందిని ఇంటికి పంపాలనేది విప్రో ప్రణాళికగా తెలుస్తోంది.

  Read More
 • బైక్ లపై భారీ డిస్కౌంట్లు.. ఇక ఒక్క రోజు మాత్రమే!
  Published Date : 30-Mar-2017 9:07:55IST

  బీఎస్-3 ప్రమాణాలు కలిగిన వాహనాలపై నిషేధం నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఏప్రిల్ 1 తర్వాత ఆ ప్రమాణాలు కలిగిన వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వడంతో ఆయా సంస్థలు ఆఫర్లకు తెరతీశాయి. హీరో మోటోకార్ప్, హోండా స్కూటర్ ఇండియా గరిష్ఠంగా రూ.12,500 వరకు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించాయి. వీలైనన్ని ఎక్కువ వాహనాలు విక్రయించడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను ఇస్తున్నాయి. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.

  Read More
 • బ్యాంకులకు వెళ్లినా ఇక వడ్డన తప్పదు!
  Published Date : 02-Mar-2017 9:01:03IST

  ఇప్పటి వరకూ ఏటీఎం వినియోగానికి మాత్రమే పరిమితులున్నాయి. ఐదు సార్లకు మించి కార్డును ఉపయోగిస్తే ప్రతిసారీ చార్జ్ తప్పడం లేదు. ఈ సంగతిలా ఉంటే.. ఇప్పుడు డైరెక్టుగా బ్యాంక్ కు వెళ్లినా.. వడ్డన మొదలు కానుంది. బ్యాంకుకు వెళ్లి ఖాతా నుంచి డబ్బుడ్రా చేయడం, డిపాజిట్లు తప్ప ఇతరట్రాన్సాక్షన్లు ఏం చేసినా.. అదనపు చార్జీలు తప్పవని తెలుస్తోంది. నాలుగు సార్లకు మించి బ్యాంకులకు వెళితే ప్రతి నగదు వ్యవహారానికీ రూ.150 వరకూ చార్జ్ పడనుందని తెలుస్తోంది. ఐసీఐసీఐ, యాక్సిస్,హెచ్డీఎఫ్ సీల్లో ఈ వడ్డన మొదలుపెట్టనున్నారు.

  Read More

 • Widget not in any sidebars
 • ట్రంప్.. భారత్ కు మేలే చేస్తున్నాడు!
  Published Date : 16-Feb-2017 7:58:30IST

  ట్రంప్ రాక నిజంగానే అనుకోని మేలు చేయొచ్చు… అతి పెద్ద మార్కెట్ అయిన మనదేశ సమస్యలపై భారత ఐటీ పరిశ్రమదృష్టి పెట్టొచ్చు… అని అన్నారు ముకేశ్ అంబానీ. ట్రంప్ రక్షణాత్మక విధానాలతో దేశీ ఐటీ రంగానికి ఊహించని మేలే జరగవచ్చని అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు దేశీ మార్కెట్లో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు తోడ్ప డగలదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ధోరణులు భారత ఐటీ రంగాన్నిఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  Read More
 • స్వల్ప ఊరటను ఇచ్చిన ఆర్బీఐ!
  Published Date : 30-Jan-2017 6:34:00IST

  ఏటీఎం కష్టాల నుంచి స్వల్ప ఊరట లభించింది. విత్ డ్రా నిబంధనలను సడలించింది ఆర్బీఐ. అయితే ఇది అందరికీ కాదు.. కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖతాదారులకు, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులకు మాత్రమే విత్ డ్రా నిబంధనలను ఎత్తివేస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ఈ విధమైన అకౌంట్లే ఎక్కువగా ఉంటాయి. వీరికి మాత్రం నిబంధనలు వర్తిస్తాయి.

  Read More
 • చివరి రోజు వసూళ్లు.. 630 కోట్ల రూపాయలు!
  Published Date : 31-Dec-2016 11:05:30IST

  ఓట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో పాత నోట్ల డిపాజిట్ల గడువు ముగింపు రోజున ఆంధ్రా, తెలంగాణల్లో ఏకంగా రూ.630 కోట్లు డిపాజిట్ అయినట్టు సమాచారం. ఇలా జమ చేసిన వారిలో కోటీశ్వరులు ఉండటం గమనార్హం. 115 మంది కోటి రూపాయల పై మొత్తాన్ని డిపాజిట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరిపై ఐటీ శాఖ దృష్టి సారిచిందట. ఈ మొత్తంతో ఏపీ, తెలంగాణల్లో మొత్తం లక్షన్నర కోట్ల రూపాయల మొత్తం జమ అయినట్టుగా బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తంలో హైదరాబాద్ లో జమ అయిన సొమ్మే ఎక్కువ.

  Read More

 • Widget not in any sidebars
 • కొత్త నోట్ల ముద్రణ చాలా చీప్!
  Published Date : 21-Dec-2016 8:43:14IST

  మారకంలోని ఐదువందల వెయ్యి నోట్ల రద్దు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న రెండువేల రూపాయల, ఐదువందల రూపాయల నోట్ల ముద్రణ చాలా చౌకగా కనిపిస్తోంది. ఒక రెండు వేల రూపాయల నోటు ముద్రణకు మూడు రూపాయలా యాభై నాలుగు పైసలను ఖర్చు చేస్తోందట ఆర్బీఐ. అదే ఐదువందల రూపాయల నోటు ముద్రణకు మూడు రూపాయలా తొమ్మిది పైసలను ఖర్చు చేస్తున్నారట. మరి వాటి విలువతో పోలిస్తే.. ముద్రణ ఖర్చు చాలా చాలా తక్కువ అని చెప్పాలి.

  Read More
 • పెట్రో ధరలు భారీగా పెంపు..?
  Published Date : 09-Dec-2016 11:59:32IST

  అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ధరలో భారీ పెరుగుదల నమోదైంది. బ్యారెల్ ముడి చమురు ధర 51 డాలర్ల మొత్తం పెరిగింది. ఈ విధమైన పెంపు నమోదు చేసుకోవడం ఇది వరసగా రెండో రోజు. ఒపెక్, నాన్ ఒపెక్ దేశాలు వియన్నాలో సమావేశం అయి.. ముడి చమురు ధరల పెంపు గురించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చల నేపథ్యంలో ఈ పెంపుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ పెంపుదల ఫలితంగా భారత్ లో పెట్రో ధరలు భారీగా పెరగనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

  Read More
 • రాజకీయాలు హాట్.. టీవీ చానళ్ల పంటపండింది!
  Published Date : 05-Dec-2016 2:06:22IST

  తమిళ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతల అనారోగ్యం నేపథ్యంలో అటు తమిళుల దృష్టి, ఇటు ఇతర రాజకీయ పరిశీలకుల దృష్టి తమిళనాడు మీదే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో తమిళ టీవీ చానళ్ల పంటపండుతోందని సమాచారం. తమిళ చానళ్లకు వీక్షకాదరణ అమితస్థాయిలో పెరగడంతో.. వాటి షేర్ల ధరలు కూడా పరుగులు పెడుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అన్ని తమిళ చానళ్ల షేర్ ధరలోనూ ఆరు నుంచి ఎనిమిది శాతం పెంపు చోటు చేసుకుందని సమాచారం.

  Read More