• స్టార్ హీరో సినిమాపై టైటిల్ రగడ!
  Published Date : 23-Jan-2017 6:02:05 IST

  జాలీ ఎల్ఎల్బీ -2 కు టైటిల్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టైటిల్ అభ్యంతరకరం అంటూ ఒక లాయర్ కోర్టుకు ఎక్కాడు. టైటిల్ లోంచి ఎల్ఎల్ బీ ని తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. టైటిల్ లో లా డిగ్రీని పెట్టడం లాయర్లను అవమానించడమేనని ఆయన చెబుతున్నాడు. జాలీ ఎల్ ఎల్ బీ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది తాజా సినిమా. తొలివెర్షన్ లో అర్షద్ వర్సీ హీరోగా నటించాడు. తాజా వెర్షన్ లో అక్షయ్ నటిస్తున్నాడు. ఫస్ట్ వెర్షన్ సమయంలో టైటిల్ పై అభ్యంతరాలు రాలేదు.

 • శ్రుతి హాసన్.. ప్రేమ బంధ పాఠాలు!
  Published Date : 23-Jan-2017 5:56:02 IST

  మనకు బాగా నచ్చిన వారితో, మనతో అనుబంధం ఉన్న వారితో కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడిపోవాలని అంటోంది శృతి హాసన్. అలా రాజీ పడినప్పుడే బంధం నాలుగుకాలాల పాటు ఉంటుందని ఈమె అంటోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రేమబంధంలోనూ లేని ఈమె ఇలాంటి విషయాలు చెబుతుండటం ఆసక్తికరంగా ఉంది. గతంలో ఈమె హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే బ్రేకప్ తో విడిపోయింది ఈ జంట. మరి ఇకపై తన అనుబంధాల విషయంలో శృతి తను చెబుతున్న పాఠాలను అనుసరిస్తుందేమో!

 • దేశభక్తి ఎక్కువైంది.. పోలీసులు కేసు పెట్టారు!
  Published Date : 23-Jan-2017 5:51:29 IST

  థియేటర్లలో జాతీయ గీతాలాపాన పలు వివాదాలకు దారి తీస్తోంది. ముంబైలో దంగల్ సినిమా ప్రదర్శనలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో జాతీయగీతం ప్లే అవుతున్న సీన్లో థియేటర్లో అంతా లేచి నిలబడ్డారు. అయితే దాసన్ అనే వ్యక్తి నిలబడలేదు. దీంతో ఆగ్రహించిన మధుకర్ అనే వ్యక్తి దాసన్ పై చేయి చేసుకున్నాడు. అయితే దాసన్ ఒక వయోవృద్ధుడు. జాతీయగీతాలాపనలో అలాంటి వారు నిలబడనక్కర్లేదు కూడా. దీంతో మిగతావారు మధుకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుకర్ పై పోలీసులు దాడికేసు నమోదు చేశారు!

 • జల్లికట్టుపై వర్మ మళ్లీ ట్వీట్..!
  Published Date : 23-Jan-2017 12:53:15 IST

  ‘జల్లికట్టు నిర్వహణలో ఇద్దరు మృతి చెందారు, 129 మంది గాయపడ్డారు. ఇప్పుడు జల్లికట్టు మద్దతు దారులు ఏమంటారు? చెప్పండి.. మేమంతా వినాలి. ఈ ఘటన చూస్తే దేవుడు కూడా జల్లికట్టు మద్దతుదారులపై కోపం చూపుతూ.. ఎద్దులపై జాలి చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ అనాగరిక క్రీడను ఇకనైనా ఆపుతారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇది వరకూ కూడా జట్టికట్టు మద్దతుదారులపై వర్మ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

 • ‘సావిత్రి’ బయోపిక్ లో ఆ హీరో పాత్రకెవరు?
  Published Date : 23-Jan-2017 12:50:46 IST

  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో టైటిల్ రోల్ కు కీర్తీ సురేష్ ను ఖరారు చేశారు. విషాదంతం అయిన నటి జీవిత చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా అంటే.. అనేక మంది లెజెండరీ నటుల ప్రస్తావన కూడా ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనది జెమినిగణేషన్ పాత్ర. సావిత్రి భర్త ఆయన. మరి ఆయన పాత్రలో ఎవరు నటిస్తారో మరి! ప్రస్తుతానికి అన్వేషణ సాగుతోందట.

 • కేసీఆర్.. ఆత్మకథ వచ్చేస్తోంది!
  Published Date : 23-Jan-2017 12:43:28 IST

  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆత్మకథ ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆత్మకథ ను రచిస్తున్నారని, ఇప్పుడు దానిపై సీరియస్ గా దృష్టి పెట్టారని, ఈ ఏడాదిలోనే అది విడుదల అవుతుందని సమాచారం. బహుశా అక్టోబర్ కు కేసీఆర్ ఆత్మకథ విడుదల కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో మొదలైన తన రాజకీయ జీవితం గురించి తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ ఆత్మకథలో ఏ విధంగా వివరిస్తాడనేది ఆసక్తికరంగా ఉంది.

 • కలెక్షన్ల విషయంలో కొత్త ఫీట్!
  Published Date : 22-Jan-2017 9:43:29 IST

  భారతీయసినిమాలో తొలి వందకోట్ల వసూళ్ల సినిమా ‘గజిని’. తొలి రెండువందల కోట్ల వసూళ్ల సినిమా ‘త్రీ ఇడియట్స్’. ముచ్చటగా మూడువందల కోట్ల సినిమా ‘పీకే’. ఇప్పుడు నాలుగువందల కోట్ల మార్కును తొలిసారి చేరబోతున్న సినిమా ‘దంగల్’. ఈ సినిమాలన్నింటిలోనూ అమీర్ ఖానే హీరో! సెంచరీ, డబుల్, త్రిబుల్.. వీటిని సాధించి కొత్త ఫీట్ల ను సాధించిన ఆమిర్ ఇప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయల సినిమాతో సరికొత్త ఫీట్ ను సాధించడం ఖాయమే. ఇప్పటికే దంగల్ వసూళ్లు 375 కోట్లకు చేరాయి.

 • కృష్ణ, చిరంజీవిల తర్వాత రామ్ చరణే!
  Published Date : 22-Jan-2017 9:38:58 IST

  క్రిష్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నాడని చాన్నాళ్ల కిందటే వార్తలు వచ్చాయి. ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు. సాయిధరమ్ తేజతో సినిమా చేయగలిగాడు కానీ, క్రిష్ చరణ్ తో సినిమా చేయలేకపోయాడు. ‘శాతకర్ణి’ తర్వాత క్రిష్ పై చరణ్ కు మరింతనమ్మకం పెరిగినట్టుగా ఉంది. అందుకే వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కనున్నదని తెలుస్తోంది. ఇందులో చరణ్ బాండ్ తరహా పాత్రలో కనిపించనున్నాడట. సుకుమార్ తో సినిమా అనంతరం ఈ సినిమా చేయనున్నాడట. ఇది వరకూ కృష్ణ, చిరంజీవి తెలుగు తెరపై బాండ్ లుగా కనిపించారు.

 • అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన లారెన్స్
  Published Date : 22-Jan-2017 9:35:06 IST

  ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ అస్వస్థతకు గురయ్యారు. మెడనొప్పితో బాధపడుతున్న ఆయనను చెన్నైలోని పల్లవి హాస్పిటల్ చేర్చారు. లారెన్స్ గత కొన్ని రోజులుగా మెడనొప్పితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.జ జల్లికట్టుపై మెరీనా బీచ్లో జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న లారెన్స్ బీచ్ వద్ద మెడకు గార్డు పెట్టుకునే కనిపించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కాసేసే అక్కడ ఉండి వెళ్లిపోయారు. ఇటు నటుడిగా అటు దర్శకుడిగా బిజీ బిజీగా ఉండే లారెన్స్ ఇది వరకూ పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొని, అధిగమించాడు.

 • సంపూర్ణేష్: నైజీరియన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
  Published Date : 21-Jan-2017 11:24:57 IST

  కొబ్బరిమట్ట’ సినిమాతో నైజీరియన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమాను ఆ ఆఫ్రికన్ భాషలోకి అనువాదం చేయనున్నట్టుగా ఈయన తెలిపాడు. ఈ విధంగా తొలి తెలుగు- నైజీరియన్ సినిమాగా ‘కొబ్బరిమట్ట’ రికార్డును సృష్టిస్తోందని ఆయన ట్విటర్ లో ప్రకటించుకున్నాడు. అలాగే తమిళ, కన్నడ భాషల్లోకి కూడా ఈ సినిమాను అనువాదం చేస్తామని ప్రకటించాడు. అయితే కన్నడలో అనువాదాలపై నిషేధం ఉంది.. మరి ఆ విషయం తెలీదేమో!

 • భారీ వసూళ్లు: దిల్ రాజు పంట పండింది!
  Published Date : 21-Jan-2017 11:20:48 IST

  రివ్యూయర్ల నుంచి ప్రశంసలు అందుకోకపోయినా ‘శతమానంభవతి’ కలెక్షన్లు అయితే బాగానే సంపాదించుకుందని సమాచారం. తొలి వారంలో ఈ సినిమా ఏకంగా 16కోట్ల రూపాయల వసూళ్ల ను సాధించినట్టుగా తెలుస్తోంది. ఈ సొమ్మంతా కేవలం ఏపీ, తెలంగాణల నుంచి వచ్చిందే. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా లెక్క వేరే! ఈ సినిమాను కేవలం పది కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తోనే చుట్టేశారు. తొలి వారంలోనే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయి. ఇంకా చాలా ఆదాయ మార్గాలున్నాయి కాబట్టి నిర్మాత దిల్ రాజు పంట పండినట్టే!

 • చైతూ- సమంత ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్సైంది!
  Published Date : 21-Jan-2017 11:17:50 IST

  జనవరి 29… ఇదీ నాగచైతన్య – సమంత నిశ్చితార్థపు తేదీ. ఇది వరకే ఈ తేదీ గురించి ప్రచారం ఉన్నా, ఇప్పుడు దాదాపు ధ్రువీకరణ అయ్యింది. ఈ తేదీన వీరి ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ ఉండబోతోందని సమాచారం. పెద్దగా హడావుడి లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. అఖిల్ నిశ్చితార్థం కూడా పెద్ద హడావుడి లేకుండానే జరిగిన విషయం విదితమే. చైతూ- సమంతల నిశ్చితార్థం కూడా అలాగే జరుగుతుందని, డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ లో వివాహం జరుగుతుందని తెలుస్తోంది.

 • చిరు.. అలా కనిపిస్తే .. విజిల్సే!
  Published Date : 20-Jan-2017 7:40:46 IST

  సిక్స్ ప్యాక్ బాడీకి రెడీ అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తొమ్మిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి తన లుక్ విషయంలో ప్రశంసలు అందుకుంటున్న చిరంజీవి, ఈ విషయంలో తనయుడు చరణ్ సలహాలు ఉపయోగపడ్డాయని అన్నాడు. తొమ్మిది కేజీల బరువు తగ్గాను అన్నాడు. ఇదే ఉత్సాహంలో సిక్స్ ప్యాక్ బాడీ పెంచడానికి తను రెడీనే అని ప్రకటించేశాడు చిరంజీవి. కాస్త కష్టపడితే అదేం కష్టం కాదు అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. మరి చిరు అలా కనిపిస్తే విజిల్సే!

 • రాశీ ఖన్నా.. ఎట్టకేలకూ ఒక స్టార్ హీరోతో?
  Published Date : 20-Jan-2017 7:35:18 IST

  ద్వితీయశ్రేణి హీరోల సరసన వరసగా సినిమాలు చేస్తున్నా, ఈ తరహా అవకాశాలు చాలానే ఉన్నా… రాశీ ఖన్నాకు స్టార్ హీరోల సరసన అవకాశం రావడం లేదనే లోటు ఉంది. ఆ మధ్య చరణ్ సరసన ఒక సినిమాలో అవకాశం వచ్చిందన్నారు కానీ.. అది నిజం కాలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా నటించనుందని సమాచారం. అయితే అధికారిక ధ్రువీకరణ లేదు.

 • జల్లికట్టు దీక్షా శిబిరానికొచ్చిన స్టార్ హీరోలు వీరే!
  Published Date : 20-Jan-2017 7:31:23 IST

  తమిళనాట యువత చేపట్టిన జల్లికట్టు అనుకూల పోరాటానికి తమిళ సినీ ఇండస్ట్రీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మెరీనా బీచ్ లో జల్లికట్టు అనుకూల వాదులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ప్రముఖ హీరోలు సందర్శించారు. వీరిలో సూపర్ స్టార్ రజనీకాంత్, ఇతర హీరోలు సూర్య, అజిత్ లు ఉన్నారు. సూర్య తండ్రి శివకుమార్ కూడా వీరి వెంట ఉన్నారు. కమల్ హాసన్, విశాల్ తదితరులు కూడా ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.